calender_icon.png 12 August, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్‌పీ

07-08-2025 12:48:28 AM

టేకులపల్లి, ఆగస్టు 6, (విజయక్రాంతి):టేకులపల్లి మండల కేంద్రంలోని మూడ్ తండా, లచ్చతండా, సింగ్యాతండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) ని బుధవారం పోలీసులు నిర్వహించారు. కార్యక్రమానికి ఇల్లందు డీఎస్పీ చంద్ర భాను హాజరై మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పొద్దన్నారు. ఆశచూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ఫ్రీ నెంబర్ కు పోనే చేయాలని సూచించారు.

వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. పోలీసులను ఫోన్ చేసాం, మీ ఖాతా నెంబరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చి క్కుకుందని వచ్చే ఫోన్లకు పోలీస్ శాఖ పరంగా సహాయం చేస్తామని తెలిపినా అటువంటి వాటిని నమ్మవద్దని మీకు అందుబాటులో ఉన్న బ్యాంకు వెళ్లాలని తెలిపారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో 43 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలను పట్టుకున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన సరైన పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని, లేనియెడల ఈ వాహనాలను సీజ్ చేయబడుతుందని తెలిపారు.

వాహనాలను కొందరు వ్యక్తులు దొంగతనంగా పట్టణాల నుంచి గాని వేరే రాష్ట్రాల నుంచి గాని తీసుకొచ్చి అమాయకమైన ప్రజలకు అమ్ముకుంటున్నారని, లేక వాటిని కుదవ పెడుతున్నారన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని సరైన పత్రాలు ఉన్నాయా లేవని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని కొనుగోలు చేయాలని వారి వద్ద నుంచి కొన్నట్టుగా అగ్రిమెంట్ రాయించుకోవాలని, త్వరగా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఇల్లందు సీఐ తాటిపాముల సు రేష్, బోడు ఎస్త్స్ర పి. శ్రీకాంత్, ఇల్లందు ఎస్త్స్ర సూర్య, కాచన పల్లి ఎస్‌ఐ నాగులమీరా, ఆళ్లపల్లి ఎస్త్స్ర సోమేశ్వర్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.