calender_icon.png 7 July, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్‌డ్ సర్వేయర్లతోనే భూవివాదాలు పరిష్కారం

27-05-2025 12:00:00 AM

కలెక్టర్ బి.ఎం సంతోష్

గద్వాల, మే 26 ( విజయక్రాంతి ) : లైసెన్స్ సర్వేయర్లతో భూవివాదాలు పరిష్కారమవడం తో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్ అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూమి హక్కల రికార్డు చట్టం,2025ను అమలులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

జిల్లా లోని లైసెనస్డ్ సర్వేయర్లకు సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ శాఖ ద్వారా మే 26 నుండి 50 రోజుల పాటు 281 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ శిక్షణలో థియరీతో పాటు ఫీల్ ట్రైనింగ్ కూడా ఉంటుందని, ఫీల్డ్లో మంచి పనితీరు చూపాలంటే థియరీ పాఠాలను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు.

శిక్షణలో సెలవులు ఉండవు కాబట్టి ప్రతి రోజు హాజరై పూర్తిగా నేర్చుకోవాలని అన్నారు.శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష ఉంటుందని,అందులో ఉత్తీర్ణులైన వారికి లైసెనస్డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లైసెనస్డ్ సర్వేయర్లు కావాలని సూచించారు.

లైసెనస్డ్ సర్వేయర్లను తీసుకో వడం వలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూవివాదాల పరిష్కారానికి దోహదపదుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అండ్ రికారడ్స్ ఏడీ రామ్ చందర్, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 48 ఫిర్యాదులు

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాల య సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 48 పిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.