calender_icon.png 7 July, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

26-05-2025 11:19:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, వైద్యం, విద్య తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారం వచ్చిన ప్రతి దరఖాస్తుపై వివరాలు రిమార్కుల విభాగంలో నమోదు చేసి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని, వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగించాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో సీజినల్ వ్యాధులపై వైద్య శాఖ ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.