calender_icon.png 7 July, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి మోకాలడ్డు!

27-05-2025 12:00:00 AM

  1. అన్నపురెడ్డిపల్లిలో సాగుతున్న పనులు
  2. ఏడాదిన్నర క్రితం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
  3. కొందరి స్వార్థంతో ఆగుతున్నపనులు

భద్రాద్రి కొత్తగూడెం మే 26 (విజయ క్రాంతి) కొందరి స్వార్థం... అందర్నీ అవస్థ పాలు చేస్తోంది... అభివృద్ధి పనులకు నిధు లు మంజూరైన పనులు ముందుకు సాగకుండా మోకాళ్ళ అడ్డేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో రూ 2.90 కోట్ల నిధులతో చేపట్టిన సెంట్రల్ లై టింగ్, రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు.

దీంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏడాదన్నర క్రితం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆ దినారాయణ పనులకు శంకుస్థాపన చేశా రు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. 

పనులు ప్రారంభించిన నాటి నుంచి అ డుగడుగునా అవరోధాలు ఎదురు కావడం తో పనులు ముందుకు సాగడం లేదు. ఒకసారి రోడ్డు విస్తరణ పనుల్లో, మరోసారి డ్రైనేజీ నిర్మాణంలో, ముచ్చటగా మూడవసారి డివైడర్లు ప్రారంభం, ముగింపు పా యింట్లు వద్ద పలుమార్లు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక దశలో పనులు పొందిన కాంట్రాక్టర్ పనులను వదిలి వెళ్లే పరిస్థితి ఏ ర్పడింది. దీంతో ఆరు నెలల పాటు అభివృ ద్ధి పనులకు ప్రతిష్టంబనా నెలకొంది.

సుమారు 1.50 కిలోమీటర్ వరకు ఇరువైపులా రోడ్డు విస్తీర్ణపరిచి, సెంట్రల్ లైటింగ్ ఏర్పా టు చేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు టెండర్లు ఆహ్వానించారు. పనులు పొందిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించగానే కొంద రు వారి స్వార్థం కోసం పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి. దీంతో ఏడాది క్రితం ప్రారంభించిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నాయి. 

అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటే నిధులు మళ్లీ పోతాయేమోనని పట్టణ వాసుల ఆందోళన చెం దుతున్నారు. చేపట్టిన పనులు ముందుకు సాగక పోవడంతో అటు మండల ప్రజలతో పాటు ,కాంట్రాక్టర్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మెతక వైఖరిని ఆసరా తీసుకొని పలువురు రాజకీయ మే ప రమావధిగా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నా రని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవంగా మూడు నెలల క్రితమే పనులు పూర్తయి ప్రారంభానికి నోచుకోవాల్సిన అభివృద్ధి పనులు 10% కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఎక్కే చెప్పనవసరం లే దు. సుమారు 30 వేల జనా భా కలిగి అన్నపురెడ్డిపల్లి మం డల కేంద్రంలో రహదారి పైకి రావాలంటే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. ఎంతో కాలంగా ఎదురుచూసిన ఫలితంగా అభివృద్ధి పనులు మంజూరయ్యాయని ప్రజలు సంతోషించారు.

వారి సంతోషం పూర్తిస్థాయిలో లభించేలా లేదు. విజయవాడ, ఎర్రగుంట, అన్నపురెడ్డిపల్లి మీదుగా పాల్వంచకు చేరుకొని, జగదల్పూర్ జాతీయ రహదారి కి ఏ మార్గం సులభతరం అవుతుంది. అందుకుగాను ఆర్ అండ్ బి అధికారులు 50 అడుగుల రోడ్లు విస్తీర్ణం కి మార్కింగ్ చేయడం జరిగింది.కొందరు అడ్డుపడుతూ 50 అడుగుల వెడల్పును కాస్త 33 అడుగులకు మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్ అండ్ బి అధికారుల నివేదికల ప్రకారం మే రోడ్డు విస్తీర్ణం పనులు నిర్మించాలని, స్వార్ధపరుల, రాజకీయ నాయకులకు వత్తుళ్లకు లొంగవద్దని మండల ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కల్పించుకొని 50 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు అభివృద్ధి పనులు, సెంట్ర ల్ లైటింగ్ త్వరితగతన పూర్తి చేయాలని ప్రజలుకోరుతున్నారు.

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి 

అన్నపురెడ్డిపల్లి మండల కేం ద్రంలో ఏడాద న్నర క్రితం చేప ట్టిన రోడ్లు విస్తర ణ, సెంట్రల్ లైటింగ్ పనులు ఆర్ అం డ్ బిఅధికారులు ప్రతిపాదించిన ప్రకా రమే నిర్వహించాలి. స్వార్థపరులైన కొందరు కోసం మార్చవద్దు. భవిష్యత్తు లో జాతీయ రహదారికి అనుసం ధాన మయ్యే రోడ్డు పనులు నాణ్యత  ప్ర మాణాలతో త్వరితగదన పూర్తిచేయాలి.

- సిపిఎం మండల కార్యదర్శి,జంగిలి వెంకటరత్నం