18-06-2025 07:03:12 PM
చింతలమనేపల్లి (విజయక్రాంతి): మండలంలోని దిందా గ్రామంలో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాఫర్(Revenue Inspector Jaffer) పరిశీలించారు. రెవిన్యూ సదస్సులో దరఖాస్తు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టంను తీసుకువచ్చిందని ఈ భూభారతి రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.