24 July, 2026 | 1:31 AM

రాంనూర్‌లో భూ రీ సర్వే సమావేశం ఏర్పాటు

24-07-2026 12:24 AM

ధర్మపురి,జూలై23 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామములో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే అవగాహన సధస్సును మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సర్వే,ల్యాండ్ రికార్డు ఏడీ కిషన్ ప్రసాద్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అధికారులకు సహకరించి తమయొ క్క సమస్యలను పరిష్కరించుకోవాలనీ ఆ యన సూచించారు.

రైతులు ఎవరు అధైర్య పడొద్దని, అందరి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారనీ ఆయ న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ ఐత తిరుపతి, పాలక వర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.