24 July, 2026 | 2:37 AM

క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సేవలు

24-07-2026 01:25 AM
  1. స్టార్ హాస్పిటల్స్‌లో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ ప్రారంభం
  2. ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ, గచ్చిబౌలిలో ఉన్న స్టార్ క్యాన్సర్ సెంటర్ (స్టార్ హాస్పిటల్స్)లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యే క పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీచంద్ మన్నం (చైర్రమన్ అండ్ ఫండింగ్ ప్రమోటర్), డాక్టర్ రమేష్ గూడపాటి (డైరెక్టర్ అండ్ ఫండింగ్ ప్రమోటర్), డాక్టర్ సాయినాథ్ బెతనాభొట్ల (సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్, మెడికల్ ఆంకాలజీ), డాక్టర్ విపిన్ గోయల్ (సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్, సర్జికల్ ఆంకాలజీ), జైరాజ్ కుమా ర్ పి.(ఫార్మర్ డైరెక్టర్), ప్రదీప్ చౌదరి (ఫిలాంత్రపిస్ట్, సామాజికవేత్త) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పేద క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రదీప్ చౌదరి (ఎండీ, జెమిని ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్), 1,000 ఉచిత క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన డాక్టర్ గౌడ శ్రీహరి (సీనియర్ కన్స ల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ), డాక్టర్ గాయత్రి పలాట్ (అసోసియేట్ ప్రొఫెసర్, ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆం కాలజీ, హైదరాబాద్)తో పాటు స్టార్ హాస్పిటల్స్ సిబ్బందిని విశిష్ట సేవలకు గాను సన్మానించారు. ఈ కొత్త విభాగం ద్వారా క్యాన్సర్ రోగులకు ప్రారంభ దశ నుంచే నొప్పి నివారణ, మానసిక, పోషకాహార, పునరావాస సేవలను సమగ్రంగా అందించనున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.