29-09-2025 01:45:38 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం బెల్లంపల్లి మార్కెట్లో పూల సందడి నెలకొంది. ఉదయం నుండే పాత బస్టాండ్ నుండి కాంటా చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై పూల అమ్మకాలు జోరుగా సాగాయి. భీమిని, నెన్నెల, మండలాలతోపాటు బెల్లంపల్లి ప్రాంతంలోని చిన్నభూద, కాశిరెడ్డిపల్లి, రాళ్ల పేట ,చంద్రవెల్లి గ్రామాల నుండి రైతులు తీరొక్క బతుకమ్మ పూలను తీసుకువచ్చి అమ్మకాలు జరిపారు. వివిధ రకాల బంతిపూల తో పాటు, సీతమ్మ జడ, గునూగు, తంగేడు పూల కొనుగోళ్లతో సోమవారం ప్రధాన మెయిన్ బజార్ ప్రాంతం మహిళలతో సందడిగా మారింది.