29-09-2025 02:33:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): “ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్" 6వ ఎడిషన్ను రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ, Novotel HICC Hyderabad లో 28 సెప్టెంబర్ 2025 సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన అత్యుత్తమ వ్యక్తులను మరియు ప్రతిభావంతులను సత్కరించి అవార్డులు ప్రదానం చెయ్యబడ్డాయి. ఈ అవార్డులు ప్రదానం చెయ్యబడిన కేటగిరీలు — ట్రిబ్యూట్, అచీవర్, స్పెషల్ జ్యూరీ అవార్డీ, ఎమర్జింగ్ టాలెంట్.
కేటగిరీలు & విజేతలు, కళలు & సాంస్కృతిక రంగం
● ట్రిబ్యూట్: లేట్ శ్రీ జగదీష్ మిత్తల్
● అచీవర్: సంద్యా రాజు
● ఎమర్జింగ్ టాలెంట్: మైత్రి రావు
విద్య
● అచీవర్: పవన్ మమిడి
● ఎమర్జింగ్ టాలెంట్: లోకేష్ గౌడ్
ఎంటర్టైన్మెంట్
● అచీవర్: రాహుల్ సిప్లిగంజ్
● ఎమర్జింగ్ టాలెంట్: దీపక్ రెడ్డి
ఫుడ్ & బెవరేజెస్
● అచీవర్: కేఫ్ నిలోఫర్-
● స్పెషల్ జ్యూరీ: సెజ్ ఫార్మ్ కేఫ్-
● ఎమర్జింగ్ టాలెంట్: బ్రౌన్ బేర్ బేకర్స్
హెల్త్ కేర్
● అచీవర్: డా. పీవీ నందకుమార్ రెడ్డి
● స్పెషల్ జ్యూరీ: డా. సెంథిల్ రాజప్ప
● ఎమర్జింగ్ టాలెంట్: డా. కృష్ణ ప్రసాద్ అన్నె
● ఆర్గనైజేషన్: MSN లాబొరేటరీస్
ఇన్ఫ్రాస్ట్రక్చర్
● అచీవర్: DSR బిల్డర్స్ & డెవలపర్స్
ఎన్జీఓ (సేవా సంస్థ)
● అచీవర్: తరుణి
● స్పెషల్ జ్యూరీ: హీల్-ఏ-చైల్డ్ ఫౌండేషన్
● ఎమర్జింగ్ టాలెంట్: కనూరి ఆనందకుమారి మెమోరియల్ & ఛారిటబుల్ ట్రస్ట్
పబ్లిక్ సర్వీసెస్
● అచీవర్: డా. సౌమ్య మిష్ర, IPS
రిటైల్
● అచీవర్: సాయ్ సిల్క్స్(కళామందిర్) లిమిటెడ్
● ఎమర్జింగ్ టాలెంట్: అరొమా ఆర్ట్
క్రీడలు
● అచీవర్: తనిపర్తి చికిత
● ఎమర్జింగ్ టాలెంట్: వైష్నవి మహేశ్
స్టార్ కిడ్
● ఎమర్జింగ్ టాలెంట్: అల్లాడి ఆరాధ్య లక్ష్మి
స్టార్ ఉమెన్
● అచీవర్: దీపికా రెడ్డి
● స్పెషల్ జ్యూరీ: ఫ్లైట్ లెఫ్టినెంట్ సోనాలి శిరపుర్కర్ (రిటైర్డ్)
● ఎమర్జింగ్ టాలెంట్: మేకపోతుల శిల్పా రెడ్డి
స్టార్ట్-అప్
● అచీవర్: డార్విన్ బాక్స్
● ఎమర్జింగ్ టాలెంట్: వైడర్
ముఖ్యాంశాలు:
ఈ కార్యక్రమం సిద్ధార్థ్ G ( టేబుల్ చైర్మన్ START 148) మరియు వీషన్ గుప్తా (కన్వీనర్) గారి భాషణతో మొదలైంది , వీరిరువురూ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ యొక్క గొప్పదనాన్ని మరియు ప్రాముఖ్యతను గూర్చి ప్రస్తావిస్తూ, ఏ విధంగా “రౌండ్ టేబుల్ ఇండియా” ‘ఫ్రీడమ్ థ్రూ ఎడ్యుకేషన్’ కార్యక్రమం ద్వారా పిల్లలను శక్తివంతం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోందో తెలియజేసారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
శివాంశ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి ద్వారా క్లాసికల్ ఫ్యూజన్ ప్రదర్శన, ఆ తరువాత ఒగ్గు రాజశేఖర్ మరియు బృందం ఒగ్గు డోలు ప్రదర్శనతో సందడిని సృష్టించారు. భూమిక తివారి బాలీవుడ్ మేడ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరియు కాంత్ రిసా, సాండ్ ఆర్ట్ ప్రదర్శన తో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమాలు తెలంగాణ సంప్రదాయ, ఆధునిక స్పూర్తిని ప్రతిభింభించేలా ఉన్నాయి.
రౌండ్ టేబుల్ ఇండియా విద్యా కార్యక్రమాలు
2024 ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ ద్వారా సమకూర్చిన నిధులతో, నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రింద వివరించిన తరగతి గదులు నిర్మించబడ్డాయి:-
● ZPHS అల్వాల్- 2 తరగతి గదులు
● MPPS గర్ల్స్ మల్కాజ్ గిరి-2 తరగతి గదులు
● MPPS అల్వాల్- 2 తరగతి గదులు
● MPUPS దేవరఫసల్వాడ- 4 తరగతి గదులు
1997 నాటి నుండి రౌండ్ టేబుల్ ఇండియా ద్వారా మొత్తం 10,040 తరగతి గదులు నిర్మించబడ్డాయి, ₹537 కోట్ల విరాళాలతో 3.78 మిలియన్ చదరపు అడుగుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి, 1.1 కోట్ల బాలల జీవితాలను ప్రభావితం చేసింది.
స్పాన్సర్లు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మా భాగస్వామ్య సంస్థలు మద్దతు అందించాయి.
రౌండ్ టేబుల్ ఇండియా గురించి
1927లో ఇంగ్లాండ్ లో ప్రారంభమైన రౌండ్ టేబుల్, ఇప్పుడు 52 దేశాల్లో 43,000 సభ్యులతో కూడిన ఒక ప్రపంచ స్థాయి సేవా సంస్థ. ఇండియాలో 1957 నుండి ప్రారంభమై, 375+ టేబుల్స్, 5000+ సభ్యులతో పని చేస్తూ “జీరో ఓవర్హెడ్ పాలసీ” అమలు చేస్తోంది, విరాళాల ద్వారా ప్రతి రూపాయి నేరుగా పాఠశాలల నిర్మాణానికి వినియోగించబడుతుంది.
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025
తెలంగాణ రాష్ట్ర ప్రతిభా వంతులు, యువతను గౌరవిస్తూనే, రౌండ్ టేబుల్ ఇండియా విద్య మరియు సామాజిక అభివృద్ధికి అందిస్తున్న కృషిని మరింత బలోపేతం చేసింది.
వివరాలకు: www.prideoftelangana.com
ఈ-మెయిల్: info@prideoftelangana.com
సంప్రదించండి: వీషన్ గుప్తా కన్వీనర్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్
📞 +91 98855 36595