calender_icon.png 29 September, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

29-09-2025 01:42:58 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలువురి కుటుంబాలను సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) పరామర్శించారు. 30 వ వార్డు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సింగ్(Former Municipal Vice Chairman Shankar Singh) కూతురు మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నూరి వెంకటేష్ తండ్రి మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించారు. 20వ వార్డు నాయకులు మతమారి శ్రీనివాస్ అత్తమ్మ, ఐదవ వార్డ్ నాయకులు ముగ్గురం కన్నయ్య తల్లి మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని ఎమ్మెల్యే వినోద్ భరోసా ఇచ్చారు.