29-09-2025 02:01:10 PM
సొంత నాయకులపనే అని సంచలన వ్యాఖ్యలు
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జహంగీర్ బాబా
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీల చించివేత సోమవారం కలకలం లేపింది. బతుకమ్మ సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ బాబా ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చించి వేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు జహంగీర్ సామాజిక సేవ చేస్తూ నిరంతరం 30 వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తున్నారు.
గతంలో కూడా జహంగీర్ బాబా ఫ్లెక్సీలను టార్గెట్ చేసి తన ఫ్లెక్సీలను చించివేసిన ఘటన కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జహంగీర్ బాబా ఆరోపిస్తున్నారు.సొంత పార్టీ నాయకుల పనే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో ఉత్కంఠ నెలకొంది.