calender_icon.png 16 October, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 139 కోట్ల విలువైన భూమికి విముక్తి

16-10-2025 01:45:55 AM

-రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్

-చెరవీడిన 19,878 గజాలు

-జనచైతన్య లేఅవుట్‌లో 4 పార్కుల స్థలాలను కాపాడిన అధికారులు

-స్థలాల చుట్టూ ఫెన్సింగ్

రాజేందర్‌నగర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి హైడ్రా గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆక్ర మణ స్థలాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తూ నే ఉంది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ.139 కోట్లకు పైగా విలువ చేసే పార్కుల స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించింది. బుధవారం ఉద యం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్, -ఉప్పరపల్లి గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2లను హుడా ఆమోదంతో ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్లలో ప్రజల అవసరాల కోసం కేటాయిం చిన ౪ పార్కుల స్థలాలు కొంతకాలంగా కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు 19,878 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులను ఆక్రమించుకుని ప్రహరీలు, షెడ్లు, గదులు నిర్మించారు. ఈ విషయంపై స్థానికుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.

దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. పార్కుల స్థలాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా సిబ్బంది కూల్చివేతల ప్రక్రి య చేపట్టారు. ఆక్రమణదారులు నిర్మించిన ప్రహరీలు, షెడ్లను పూర్తిగా తొలగించారు. అనంతరం, స్వాధీనం చేసుకున్న స్థలం చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.

దీంతో ఆ ప్రాంతంలోని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారి పైన కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా భవిష్యత్‌లో ఇలాంటి కబ్జాలు పునరావృతం కాకుం డా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూము లను కాపాడటంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.