07-08-2025 12:42:45 AM
ఆర్డిఓ భూనిర్వాసితులకు ద్రోహం తలపెడుతున్నారని మండిపాటు
నారాయణపేట ఆగస్టు 6 (విజయక్రాంతి): నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా దామరగిద్ద మండ లం లోని మల్రెడ్డిపల్లి చెరువు దగ్గర రిజర్వాయర్ కోసం బుధవారం రోజు జిల్లా అధికా రులు సర్వే చేసేందుకు ప్రయత్నించగా మల్రెడ్డిపల్లి ,కానుకూర్తి ,గడి మున్కాన్ పల్లి భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగా రు. భూ సర్వే కు వచ్చిన అధికారులు వెంట నే వెనుతిరిగి పోవాలని పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
ఆర్ డి ఓ రామచంద్రనాయక్ , డీఎస్పీ లింగయ్య, భూ నిర్వాసితులను సముదాయించే ప్రయత్నం చేసిన భూ ని ర్వాసితులు తమ ఆందోళనను విరమించలే దు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి భూనిర్వాసితులకు మధ్య తోపులాటల తో యుద్ధ వాతావరణం నెలకొంది.ఆ తర్వా త అధికారులు పరిస్థితుల్లో రెవిన్యూ పోలీస్ సి బ్బందితో సహా వెనుదిరిగారు.
భూ నిర్వాసితులతో చర్చించేందుకు దామరగిద్ద మం డల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో రావాలని ఆర్డీవో తెలియజేయడంతో ఇక్కడి నుంచి భూనిర్వాసితులు వెంకట్రామిరెడ్డి, మశ్చందర్, గోపాల్ ఆధ్వర్యలో పెద్ద ఎత్తున దామరగిద్ద మండల కేంద్రంలోని తాహాసిల్దార్ చేరుకున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వాసితులు ఆర్డిఓ రామచంద్రనాయక్ మధ్య జరిగిన చర్చలు జరిగాయి ఎకరానికి 14 లక్షల రూపాయలు ఇస్తామని ఆర్ డి ఓ పదే పదే చెప్పారు. దీంతో రైతు ప్రతినిధులు ఆమోదయోగ్యం కాదని రైతు లు తెలిపారు.బహిరంగ మార్కెట్ ధరకనుగుణంగా మాకు పరిహారం అందివ్వాలని కోరగా ఆర్డీవో పదేపదే 14 లక్షల రూపాయ లు పరిహారం అనడంతో భూనిర్వాసితులు నిరసనతో సమావేశం బహిష్కరించి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వ హించారు తమకు న్యాయమైన పరిహారం అందించేదాకా తమ భూములను ప్రభుత్వానికి అప్పజెప్పమని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు అంజిలయ్య గౌ డ్ ,మహేష్ కుమార్ గౌడ్ , మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, కానుకుర్తి భీమిరెడ్డి,మొగులప్ప, శ్రీనివాసరెడ్డి ,మోహన్ , చంద్రశేకర్, గౌస్, మనోహర్,సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ పాల్గొని ప్రసంగించారు.ఈ ధర్నా కా ర్యక్రమంలో 200 మంది భూ నిర్వాసితులు పాల్గొన్నారు.ప్రభుత్వం మొండిగా ముందుకే వెల్తే తమ ఆందోళన ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
మహాపాద యాత్ర ఆగస్టు 7న కానుకూర్తి నుంచి దామరగిద్ద మండలం తాసిల్దార్ కార్యాలయం వరకు భూనిర్వాసితుల మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ ,కానుకుర్తి భీమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,తెలిపారు.మహా పాదయాత్రలో రైతులు బిడ్డలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నేతలు అధిక సంఖ్యలో హాజరుకావాలనిపిలుపునిచ్చారు.