07-08-2025 12:41:47 AM
కొత్తగూడెం, ఆగస్టు 6, ( విజయ క్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలోని, టూ ఇంక్లైన్ ఏరియా నివాసి అయిన కోలపురి తులసిరామ్ మంగళవా రం ఉదయం చాతి నొప్పితో స్థానిక ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు ఖమ్మం దవాఖానకు వెళ్ళమని సూ చించారు.
మార్గం మధ్యలో హాట్ స్ట్రోక్ తోక న్ను మూశారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె అయినా, ప్రవళి క తన తండ్రికి తల కొరివి పెట్టి తండ్రి ఋ ణం తీర్చుకుంది. పలువురు అభ్యంతరం వ్య క్తం చేసిన పెద్దల సలహా మేరకు, తలకొరివి పెట్టడానికి సిద్ధపడింది. ఆడపిల్ల అయినా మగ పిల్లవాడు అయినా ఇరువురు ఒక్కటే అనే సమానత్వాన్ని, ధైర్యాన్ని చాటింది. మగవారికి ఏమాత్రం తీసుపోనీ విదంగా, తన త్యాగాన్ని పలువురు అభినందించారు.