20 August, 2026 | 3:15 AM

భూ యజమానులు తప్పక హాజరు కావాలి

20-08-2026 12:00 AM
  1. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ స్పెషల్ డీసీ అపర్ణ
  2. టీడీఆర్‌పై అవగాహన సదస్సు

సికింద్రాబాద్,ఆగస్టు19 (విజయక్రాంతి): టీడీఆర్ సర్టిఫికెట్‌ను హెచ్‌ఎండిఏ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందనిస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) అపర్ణ తెలిపారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ వరకు ఎస్ హెచ్01 పై చేపడుతున్న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి   భూ యాజమానులకు బదిలీ చేయగల అభివృద్ధి హక్కులు టిడిఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులపై సందేహాలను నివృత్తి చేసేందుకు అవగాహన సమావేశంఆగస్టు 20, 2026న మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ కలెక్టరేట్, లక్డీకాపూల్లోని కాన్ఫరెన్స్ హాల్లో  జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్. ఏ) అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత భూ యాజమానులకు టిడిఆర్ ప్రక్రియ, కొత్త నిబంధనలపై వివరించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని తెలిపారు.  సంబంధిత  భూ యాజమా నులందరూ అవగాహన సమావేశానికి హా జరై, ప్రభుత్వ కొత్త ఉత్తర్వు ప్రకారం టిడిఆర్ ప్రక్రియపై అవసరమైన వివరాలు తెలుసుకోవాలని కోరారు.

సవరించిన నిబంధనల ప్రకారం, హెచ్‌ఎండిఏ చేపట్టే ప్రాజెక్టుల కోసం భూమి అవసరమైనప్పుడు లేదా భూ మిని అప్పగించినప్పుడు, హైదరాబాద్ మె ట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ  ద్వారా ఆన్లైన్ విధానంలో టిడిఆర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని తెలిపారు. ఈ విధంగా జారీ చేయబడిన టిడిఆర్ సర్టిఫికెట్ను హెచ్‌ఎండిఏ పరిధిలో ఎక్కడైనా వినియోగిం చుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందని, అయితే తెలంగాణ బిల్డింగ్ రూల్స్ అలాగే  వర్తించే ఇతర చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

ప్రభుత్వ మౌలిక వసతులు, రహదారులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమి అవసరమైన సందర్భాల్లో, నిబంధనల ప్రకారం అర్హులైన భూయాజమానులకు అభివృద్ధి హక్కులను అందించే విధానమే టిడిఆర్ అని తెలిపారు. ఈ అభివృద్ధి హక్కులను  నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవడం లేదా బదిలీ చేయడం ద్వారా నగదీకరించుకునే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.