calender_icon.png 24 May, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నేషనల్ హెరాల్డ్’కు పెద్ద మొత్తంలో విరాళాలు

24-05-2025 01:59:34 AM

-సీనియర్ల సూచన మేరకే విరాళాలు ఇచ్చారని ఈడీ ఆరోపణలు

- రేవంత్ సూచనలతో తెలంగాణ నుంచి 80 లక్షల విరాళం!

-కర్ణాటక, పంజాబ్ నుంచి కూడా భారీగా విరాళాలు

న్యూఢిల్లీ, మే 23: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను వేగవంతం చేసింది. తాజా గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవే ట్ లిమిటెడ్ కంపెనీకి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందించినట్టు ఈడీ ఆరోపించింది.

సీనియర్ నాయకుల సూచన మేరకు దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు విరాళాలు ఇచ్చారని, అలా చేయకపోతే వారి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలకు నష్టం జరుగుతుందని భావించారని ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తెలంగాణ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలతో నలుగురు కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు 80 లక్షలు విరాళం అందించినట్టు తెలుస్తోంది.

వీరిలో గాలి అనిల్ కుమార్ (20 లక్షలు), మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ (20 లక్షలు), పి.సుదర్శన్ (15 లక్షలు), మరో 25 లక్షలు అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చాయని, ఈ మొత్తం కేవలం ఒక నెలలోనే చెల్లించినట్టు ఈడీ పేర్కొంది.

వీరితో పాటు 2019 2022 మధ్య కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పవన్ బన్సల్, దివంగత అహ్మ ద్ పటేల్ కూడా పెద్ద మొత్తంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చారని ఈడీ తెలిపింది. అయితే వీరిలో ఎవరిని కూడా ఈడీ ఇప్పటివరకు నిందితులుగా పే ర్కొనలేదు. అయితే ఈడీ ఆరోపణలపై కాం గ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సోని యా, రాహుల్‌పై ఈడీ నమోదు చేసిన ఛార్జిషీట్ ప్రతీకార రాజకీయమని ఆరోపించింది.