calender_icon.png 24 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

24-05-2025 01:56:26 AM

-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో ఘటన

నాగ్‌పూర్, మే 23: మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు దళాలకు నడు మ జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నది సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

మా వోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గురువారం మధ్యాహ్నం వేటను ప్రారంభించగా.. శుక్రవారం ఉద యం మావోయిస్టులు చిక్కారు. దాదాపు రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. భారీ వర్షం నడుమ ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీలోత్పల్, డీఐజీ అంకిత్ గోయల్ పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్‌లో 12 యూనిట్లకు చెందిన సీ60 కమాండోలు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో నలుగురు మావో యిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, వాకీ టాకీలు, మావోయిస్టు సాహిత్యం లభించినట్టు అధికారులు తెలిపారు.