7 March, 2026 | 3:43 PM

3.49 కోట్ల గంజాయి పట్టివేత

25-05-2025 12:44 AM

ఆరుగురిని అదుపులో తీసుకున్న పోలీసులు 

టేకులపల్లి, మే 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మం డలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద శనివారం అక్రమంగా తరలిస్తున్న రూ 3.49 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకు న్నారు. ఎస్పీ రోహిత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ సమీపంలో టేకులపల్లి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తరుణంలోనే కారు నెంబర్ హెచ్‌ఆర్05కేబీ6032 ఐచర్ వ్యాన్, హెచ్‌ఆర్63ఈ315 ఐచర్ వ్యాన్‌లో తనిఖీలు చేయగా 698 కిలోల గంజాయి లభించినట్టు చెప్పారు. దీని విలువ సుమారు రూ.3.50 కోట్లు ఉంటుందని ఎస్పీ వివరించారు.