ఇంట్లోనే షాంపూ తయారీ!
ప్రస్తుతం చాలామంది కెమికల్ ఫ్రీ ప్రోడెక్ట్స్‌నే ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. నేచురల్ పద్ధతులను ఫాలో అవుతున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఇంట్లోనే సబ్బులను తయారు చేసుకొని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో షాంపూని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకోవడానికి.. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, టీట్రీ ఆయిల్, ఆర్గానిక్ షాంపూ వంటి పదార్థాలు అవసరం అవుతాయి.
తయారీ: ముందుగా వెల్లుల్లికి తొక్క తీసి.. పేస్టులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నీటిని యాడ్ చేయాలి. ఇందులో ఆలివ్ ఆయిల్, పిప్పర్ మింట్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, ఆర్గానిక్ షాంపూ వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఓ బాటిల్‌లోకి తీసుకోవాలి. ఇలా తయారైన షాంపూ కనీసం రెండు వారాలైనా నిల్వ ఉంటుంది. వారానికి రెండు సార్లు షాంపూని ఉపయోగించాలి. రెగ్యులర్‌గా ఈ షాంపూని ఉపయోగిస్తే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.






