calender_icon.png 12 November, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలల సందుక కవిత్వ సంపుటి ఆవిష్కరణ

12-11-2025 06:52:33 PM

చిట్యాల (విజయక్రాంతి): హైదరాబాదులోని రవీంద్రభారతిలో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి డాక్టర్ మండల స్వామి రచించిన కలల సందుక కవిత్వ సంపుటిని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బలమైన అభివ్యక్తి, చక్కని శిల్పంతో డాక్టర్ మండల స్వామి సమ సమాజాన్ని కాంక్షించే కవిత్వం రాశారని అన్నారు. డాక్టర్ మండల స్వామి కవిగా, రచయితగా, కథకుడిగా, పరిశోధకుడిగా బహుముఖీనమైన కృషి చేసిన మండల స్వామి మరికొంత కాలం బతికి ఉంటే తెలుగు సాహిత్యం సుసంపన్నం అయ్యేది అని అన్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ మండల స్వామి వృత్తిదారుల జీవితాలను సాహిత్యంలో నిలిపారన్నారు. సంస్కృత ఆంధ్ర పండితులు మోత్కూరి నరహరి మాట్లాడుతూ చిన్న వయసులోనే గురువులు గర్వించే స్థాయికి ఎదిగిన మండల స్వామి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకున్న సృజన సాహితీ మిత్రులు అభినందనీయులు అన్నారు. పెరుమాళ్ళ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఎన్.బాలాచారి, డా. తండు కృష్ణకౌండిన్య, వేముగంటి మురళీకృష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, డా. సాగర్ల సత్తయ్య, డా. ఉప్పల పద్మ, డా. కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్, కొండేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.