20 August, 2026 | 8:06 AM

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ లాంచింగ్

15-06-2024 12:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): టాటా మోటార్స్ సరికొత్త వెహికల్ ఆల్ట్రోజ్ రేసర్‌ను నిజామాబాద్‌లోని శ్రీవెంకటేశ్వర మోటార్స్‌లో శుక్రవారం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌బీఐ మేనేజర్లు అరవింద్, ప్రేమ్, మహీంద్రా ఫైనాన్స్ ఇందూ సింద్ సుందరం హాజరయ్యారు. ఈ సందర్భంగా షోరూం యజమాని మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే ఆల్ట్రోజ్ రేసర్‌కు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పారు. టాటా మోటార్స్ దేశంలోని అన్ని కంపెనీల కంటే 5 స్టార్ సేఫ్టీ అందిస్తుందని వెల్లడించారు.