17 April, 2026 | 4:04 PM

విద్యుదాఘాతంతో గడ్డి ట్రాక్టర్ దగ్ధం

01-05-2025 08:53 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండలం మోద్గులగూడెం గ్రామంలో ఐలి వీరేందర్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ గడ్డి లోడుతో వస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాహన దారుణ భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.