01-05-2025 02:28:52 AM
ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: అయోధ్యలో కొత్తగా బాబ్రీ మసీదును నిర్మి స్తాం.. మొదటి ఇటుక వేసేది పాక్ సైనికులే. ఆ మసీదులో మొదటి అజాన్ (ప్రార్థన సమయం అయిందని పిలుపు) ఇచ్చేది పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అని పాకిస్థాన్ సెనెటర్ పల్వాషా మొహమ్మద్ జై ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా పాకిస్థాన్ సెనెట్‌లో (ఎగువ సభ) ప్రసంగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేశారు.
భారత్ దాడి చేస్తే.. మేము గాజులు తొడుక్కుని లేమన్నారు. పాక్‌తో భారత్ యుద్ధానికి తలపడితే సిక్కు సైనికులు పాక్‌తో యుద్ధం చేయ రని.. ఎందుకంటే గురునానక్ పాకిస్థాన్ వాడేనని ఆమె వాదించారు. పాకిస్థాన్ గురునానక్ దేవ్ భూమి, సిక్కులకు మతపరంగా పవిత్ర స్థలం అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో భారతీయులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది.
పాకిస్థాన్‌కు చెందిన నాయకులు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఇటీవల ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ.. భారత్‌పై అక్కసును వెళ్లగక్కాడు. ‘సింధూ నది మాది. అది ఎప్పటికీ మాదే. సింధూ నదిలో నీరు ప్రవహిస్తుంది.
లేదా భారతీయుల రక్తం ప్రవహిస్తుం ది’ అని బెదిరింపులకు దిగారు. పాకిస్థాన్ మా జీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఎక్స్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘పాకిస్థాన్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుంది. కానీ పాక్ శాంతి స్వభావాన్ని బలహీనతగా చూడొద్దు. భారత దాడులకు సమాధానం చెప్పే సామర్థ్యం పాకిస్థాన్ వద్ద ఉంది.’ అని పోస్ట్ చేశారు.