calender_icon.png 1 May, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెనాల్ట్ ట్రైబర్ కారులో చెలరేగిన మంటలు

01-05-2025 11:21:16 AM

రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని ఆరంగర్ చౌరస్తా సమీపంలో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద పెను ప్రమాదం తప్పింది. గురువారం పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద పిల్లర్ నెంబర్ 312 వద్ద నడుస్తున్న రెనాల్ట్ ట్రైబర్  కారులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో అందుకున్న ఉన్న నలుగురు ప్రయాణికులు బయటకి వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు  సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కారు అగ్నికి ఆహుతైపోయింది. చార్మినార్ నుండి శంషాబాద్ వైపు కారు వెళుతున్నట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో పాయల్ అనే మహిళ,మరొక వ్యక్తి, ఇద్దరు పిల్లలు, ఒక పెంపుడు కుక్క కారులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాహాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.