19 May, 2026 | 9:30 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

మిర్యాలగూడను జిల్లాగా చేయాలని ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్‌కు వినతి

15-01-2026 01:36 AM

మిర్యాలగూడ, జనవరి 14 : మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆద్వర్యంలో  బుదవారం స్థానిక ఎంఎల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలువురు సమితి సభ్యులు మాట్లాడుతూ మిర్యాలగూడకు జిల్లాగా ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయన్నారు. అలాగే దీన్ని జిల్లాగా మార్చడం వల్ల చాలా మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తదుపరి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు సైతం  వినతి పత్రాన్ని అందజేశారు.

జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నేతలు, మాల మహానాడు జాతీయ  అధ్యక్షులు తాళ్ళపల్లి రవి, బిసి జేఏసీ కోకన్వీనర్ జయరాజు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదొద్దిన్, ఏండి అస్లాం,రంగా శ్రీనివాస్, బొంగారాల మట్టయ్య, యాదగిరి తోపాటు  బెజ్జం సాయి,సిద్దు నాయక్,నాగేష్, మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.