08-12-2025 06:31:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తులు మిగతా భక్తులు ఆర్టీసీ సర్వీసులను ఉపయోగించుకోవాలన్నారు. కానిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, శబరిమల వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధురై నుండి నిర్మల్ కు చేరుకుంటుందని, 6 రోజుల ప్రయాణం ఒకరికి టికెట్ ధర 7650/- ఉంటుందని, ఎలాంటి టోల్ ట్యాక్సి లు, భార్డర్ టాక్స్ లు ప్రయాణికుల వద్ద వసూల్ చేయమని ఆయన తెలిపారు. దర్శనానికి వెళ్లి వచ్చే వారికి సౌకర్యంగా ఉంటుందని మరిన్ని వివరాలకు 9959226003, 83280 21517, 7382842582 లో సంప్రదించాలని ఆయన కోరారు.