కాంగ్రెస్ పార్టీకి అండగా బీసీలుl
05-05-2024 01:22 AM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంఘాల నేతలు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): బీసీ కులగణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని శనివారం పలువురు బీసీ సంఘాల నేతలు కలిశారు. బీసీల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చిందని జాజూల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో బీసీ సంఘాల నేతలు శ్రీశైలం యాదవ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, ఈడిగ శ్రీనివాస్, భాస్కర్ తదితరులు ఉన్నారు.




