28 March, 2026 | 5:20 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

30న నాగిరెడ్డిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం

28-03-2026 03:24 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తేది.30-3-2026  ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక స్పెషలిస్ట్ మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతుందనీ వైద్యాధికారులు సృజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజన్ కుమార్ మాట్లాడుతూ... ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, (స్త్రీ వైద్య, ప్రసూతి నిపుణులు) ఆర్థోపెడిక్స్, కంటి సమస్యల, డెంటల్, పీడియాట్రిక్స్, పరీక్షలకు సంబంధించిన డాక్టర్లులు పాల్గొంటారు. కావున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, క్యాంపుకు వచ్చేవారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని ఈప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు.