రైతుల చేత పౌర సన్మానం పొందిన విద్యుత్ కార్మికుడు నాదెళ్ల బాలకృష్ణ
03-06-2026 05:50 PM
కోదాడ,(విజయక్రాంతి): రాష్ట్రములో రైతుల చేత పౌర సన్మానం పొందిన విద్యుత్ కార్మికుడు నాదెళ్ల బాలకృష్ణ అని సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోదాడ మండల సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాదెళ్ల బాలకృష్ణ కు శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసిన సందర్భంగా గ్రామంలోని రైతులు, ప్రజలు, నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో బుధవారం పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాదెళ్ల బాలకృష్ణ మాట్లాడుతూ వినియోగదారులకు ఎప్పుడు విద్యుత్ సమస్య వచ్చిన నేను ముందుండి పరిష్కరిస్తానని అన్నారు.






