calender_icon.png 19 May, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ మందిర్ పీఠాధిపతిని పరామర్శించిన నాయకులు

19-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా అనారోగ్యానికి గురి అయిన విషయం తెలుసుకొని ఆదివారం పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు.

గాంధారి కామారెడ్డి లో కృష్ణ మందిరాల పీఠాధిపతి అయిన బాబా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ, హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గత 15 రోజులుగా వైద్య చికిత్స పొందారు. స్వయంగా గాంధారి కృష్ణ మందిర్ కి వెళ్లి బాబాను పరామర్శించి యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తొందరగా ఆరోగ్యం కోలుకొని మళ్లీ దేవునికి పూజలు చేయాలని ఆకాంక్షించారు. పరమర్శించిన వారిలో ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, టిఆర్‌ఎస్ గాంధారి మండల అధ్యక్షులు వజిర్ శివాజీ రావు, రాష్ట్ర ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ వజీర్ ముకుందరావు, మాణిక్ రావు, నర్సింగ్ రావు, తదితరులున్నారు.