06-02-2026 12:00:00 AM
రాజకీయ నాయకులు ప్రత్యర్ధులను తిట్టడమే గాకుండా, వారి ఆరోపణలు కూడా దారుణంగా ఉంటున్నాయి. ఈ ఆరోపణలను న్యాయస్థానాలు ఎందుకు సుమోటా గా స్వీకరించకూడదు? అనేది తెలియాలి.
రాజకీయ నాయకుల చిత్రమైన పద్ధతులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేదా? అన్న అనుమానం కలగక మానదు. ఈ నాయకులు ఎంత భూస్వాములమని చెప్పుకున్నా, 30--40 సంవత్సరాల క్రితం వీళ్లు ఒక మధ్యతరగతి జీవులే. జమీందార్లమంటూ చెప్పుకొని భూదోపిడీ, ఇతర నిరంకుశత్వ పనుల కారణంగా తెలంగాణ గ్రామాల్లో నక్సలైట్ ప్రభావం పెరిగిపోయింది.
నక్సల్స్‌కు భయపడి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పట్నం దిశగా పరుగులు తీసిన నాయకులు ఎందరో ఉన్నారు. అ లాంటి జమీందారీ కుటుంబాల్లో నుంచి అనేకులు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎలా ఎదిగారన్న వైనం అందరికీ తెలిసిందే.
ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడికి నెలవారీ జీతం రెండు లక్షల డ్బ్బు అయిదు వేల వరకు ఉం టుంది. అదే ముఖ్యమంత్రికైతే నాలుగు లక్షల వరకు వేతనం ఉంటుంది. ఈ ఆదాయాలతో ఎవరైనా ఎలా కోట్లకు పరుగెత్తగ లరు? అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. అదీ చాలదని మళ్లీ ఈ నాయకులే వేదికల మీదకెక్కి లంచగొండితనాన్ని నశింపజేస్తామంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు.
తమ ఉపాన్యాసాలతో ప్రజల సెంటి మెంట్‌ను రెచ్చగొట్టగలరు.. అవసరమైతే తమ కఠినత్వ వైఖరితో అదే ప్రజలను ఏడ్పించగల సిద్ధహస్తులు. వీళ్ళు చేసే నటన ముందు ఏ మహానటులు పనికిరారు. ‘నైతిక విలువలు లేని రాజకీయం అత్యంత చెడ్డదని’ జాతిపిత మహాత్మాగాంధీ ఒక సంద ర్భంలో పేర్కొన్నట్లుగా రాజకీయ అవినీతిని అధిగమించకపోతే ఈ దేశం స్థితి ఎన్నటికీ మారదని గ్రహించాలి.
భాష హద్దుమీరొద్దు!
ఇక రాజకీయ నాయకులు వేదికలపై ఉపన్యాసాలను దంచికొట్టే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రజలను నమ్మించడానికి వీళ్లు వేసే వేషాలు మాములుగా ఉండవు. ఇంత చేసినా వీళ్ల అభినయ పర్వంలో తెలంగాణ ఉద్యమం నాటి నుంచి భాష కూడా పూర్తిగా మారిపోయింది. ఏ డిక్షనరీ చూపించని పదాలు, ఎప్పుడో ఆవే శం వస్తే తప్ప, సాధారణ మానవులు ఎవ రూ వాడని పదాలు, వీళ్ల ఉత్తుత్తి ఆగ్రహావేశాలకు బలవుతున్నాయి. మన నాయ కుల తీరు మారదులే అనుకొని ఉద్యమం సమయంలో వాడిన భాషను పక్కన పెట్టేద్దాం.
కానీ రాష్ట్ర సాధన జరిగి స్థిమితం వచ్చాకా, అధికారం చేపట్టాక కూడా ఇదే దురవస్థ కొనసాగింది. అధికారం మారిన తర్వాత కూ డా ‘అతని కంటే ఘనుడు అల్లుడు మల్లన్న’ అన్నట్టుగా ఇంకో రెండు ఆకులు ఎక్కువై కొనసాగుతున్నది. ఏ భాష వల్ల అధికారం వచ్చిందని జబ్బలు చరుచుకున్నారో ఆ భాషే వాళ్లని ఓడించిందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ బూతుల పంచాంగం ఎవరు ప్రారంభించారు అనేది పక్కనబెడితే దీనిని ఎవరు ముగిస్తారు అనేదే ఇక్కడ ప్రధాన అంశం.
ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం వేదికల మీద అసభ్యంగా మాట్లాడితే మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఎవరినైనా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడితే మూడు సంవత్సరాల వర కు జైలు శిక్ష ఉంటుంది.
పార్టీ ఫిరాయింపులు..
రాజకీయ నాయకులు ప్రత్యర్ధులను తిట్టడమే గాకుండా, వారి ఆరోపణలు కూడా దారుణంగా ఉంటున్నాయి. ఈ ఆరోపణలను న్యాయస్థానాలు ఎందుకు సుమోటా గా స్వీకరించకూడదు? అనేది తెలియాలి. సెక్షన్ 248 (తప్పుడు అభియోగాలు మోప డం) ప్రకారం ఎవరైనా సరే , ఏ హోదాలో ఉన్న సరే కనీసం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఈ గాలి వాటం నాయకులకు, వాళ్ల పార్టీలకు ఒక సిద్ధాంతం ఉండ దు. ఒక ప్రాపంచిక దృక్పథం ఉండదు.
పార్టీలు ఫిరాయించడానికి కూడా ఇలాంటి ప్రత్యేక విధానం లేకపోవడం చేతనే నాయకులు సులువుగా పార్టీలు ఫిరాయించడానికి ఆస్కారముంటుంది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ముందు ఈ పార్టీల ఫిరాయింపు (మన తెలుగు రాష్ట్రాలలో) ఒక ప్రహసనం గా మారింది. ‘రాజకీయ నాయకులకు తమ పనుల పట్ల నైతిక బాధ్యత లేనప్పుడు రాజ్యాంగ విలువలు పతమౌతాయి’ అని అంబేద్కర్ అన్నట్లుగా.. నాయకులు తన సొంత ఆస్తుల పరిరక్షణ కోసమో లేక అధికారంలో ఉండాలనే కోరికతో ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారు.
పరస్పర దూషణలు..
ప్రపంచ దేశాల్లో భారత్ ఎన్నటికీ ఒక లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశంగానే చూడబడుతున్నది. తమ రాజకీయ చర్యలతో నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ , న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఉత్తమ ప్రజాస్వామిక దేశాలుగా నిలుస్తున్నాయి. మన దేశంలో దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉన్న నేతలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ దశాబ్దాల పాటు అధికారాన్ని అను భవించిన నేతలు క్రమంగా మాటలు తూలుతూ ప్రజా విశ్వాస్వాన్ని కోల్పోతున్నారు.
అధికారానికి దూరమైన నేతలు పరస్పరం ఒకరినొకరు దూషించుకుంటూ దుర్భాషలాడుకుంటున్న వైనం పెరిగిపోతున్నది. ప్రజా జీవితంలో రాజకీయ నాయ కులు వాడుతున్న భాష పట్ల మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అధికారంలో ఉన్నవారైనా, అధికా రానికి దూరమైన నాయకులైనా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభీష్టంతోనే రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారన్న విషయం మరిచిపోవద్దు.
కాబట్టి ఒక నాయకుడు మరొకరిని ఉద్దేశించి మాట్లాడే సందర్భాల్లో ఉచ్ఛరిస్తున్న భాష ఆ నేతలనే కాకుండా, వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలను సైతం గాయపరుస్తుందన్న విషయాన్ని ఎలా మరిచిపోతున్నారన్నది అర్థం కావడం లేదు.
రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మన దేశం నుంచి తరిమికొట్టే క్రమంలో స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు సైతం విదేశీ పాలకులను ఈ తరహాలో ఎన్నడూ దుర్భాషలాడలేదు. అయితే భారత్‌లో ఒక సాధారణమైన ఎమ్మెల్యే వస్తేనే ఎంత హడావిడి ఉంటుందో చెప్పనవసరం లేదు.
ఇక అదే ఒక ముఖ్యమంత్రి ప్రయాణించే కాన్వాయ్ ఊర్లోకి వస్తే ప్రజల డబ్బు వృథా అవుతుందన్న దానికి లెక్కే లేదు. ఇక తెలంగాణాలో బీసీలు, బహుజనుల పట్ల సానుకూలత చూపించే విధంగా నాయకుల కొత్త గొంతులు కొన్ని వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణే మన బలం అని నాయకులు గట్టిగా జోడించి చెబుతున్నారు. కొత్త రాగం పలికే ఏ నాయకులైనా తమ వాగ్దానాలకు ఒక ప్రామాణికత చూపించాల్సిన అవసరం ఉంటుంది.
డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు