18 March, 2026 | 1:59 AM

ఆంజనేయస్వామికి ఆకు పూజ

18-03-2026 12:24 AM

ఉగాది రోజున గుట్టలో పంచాంగ శ్రవణం  

యాదగిరిగుట్ట, మార్చి 17 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ ఉత్సవము పండితులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉదయం నిత్యారాధనల అనంతరం స్వామివారి  నృసింహ హోమం,  నిత్య కళ్యాణం, సాయంత్రం వెండి జోడి సేవను సాంప్రదాయ ప్రకారంగా నిర్వహించారు.

పరాభవ నామ సంవత్సరము ఉగాది పర్వదినము పురస్కరించుకొని 19 గురువారము రోజున సాయంత్రం 5 గంటలకు  తూర్పు రాజగోపురం ముందు శ్రీ స్వామి వారి ప్రత్యేక సేవ వేంచేపు గావించి ఆస్థాన సిద్ధాంతిచే పంచాంగ శ్రవణ కార్యక్రమము నిర్వహించ  జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య రాబడి  27,74,928 యాదగిరిగుట్ట దేవస్థానం కు వివిధ శాఖల నుండి  ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.