25 August, 2026 | 3:38 PM

Breaking News

వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •  

తెలుగు నేర్చుకుంటున్నా..

26-07-2024 12:05 AM

తెలుగమ్మాయిని కాకపోయినా ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు అని మురిసిపోతోంది హాసినీ సుధీర్. రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన ‘పురుషోత్తముడు’ చిత్రంలో కథానాయికగా నటించిందామె. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాను న్న సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించిన ఈ మరాఠీ భామ “హీరోయిన్ కావాలన్నది నా చిన్నప్పటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను. దర్శకుడు రామ్ భీమన ఆడిషన్ చేసి ఈ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు.

ఈ సినిమాలో అమ్ములు అనే పాత్ర పోషించాను. తొలి సినిమాలోనే ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ లాంటి నటులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. కళ్లతోనే వాళ్లు భావోద్వేగాలన్ని పలికిస్తారు. తొలి సినిమా అన్న భావనను దూరం చేస్తూ సెట్స్‌లో రాజ్‌తరుణ్ సహకారం అందించారు” అంటూ సినిమా సంగతులను పంచుకుంది. తెలుగు సినిమాల మీద మక్కువతో భాష కూడా నేర్చుకున్నా అంటున్న హాసిని.. హీరో నాని తన అభిమాన కథానాయకుడని చెప్పుకొచ్చింది.