18-07-2025 01:06:55 AM
వారి కడుపునిండా విషమే!
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాకనే అరెస్టులు చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ర్టప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ర్టలో పర్యటిస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రెండున్నర సంవత్స రాల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో ముందు కు రావాలని, అందుకు కిషన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు. జల వివాదాలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో మూడు అంశాలు పరిష్కారానికి వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి కమిటీ వేశామని, కమిటీ పరిష్కరించలేని అంశాలపై ఇద్దరు ము ఖ్యమంత్రులం మళ్లీ చర్చిస్తామని చెప్పా రు. నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అను సంధించాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిపి పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి..
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారని, అందుకు కేసీఆర్ ఒప్పుకోవడం లేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. సొంత వివాదాలతోనే కేసీఆర్ కుటుంబానికి సరిపోతోందని, కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. రాష్ట్ర సమస్యలతో పాటు పక్క రాష్ట్రాలతో జల వివా దాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం కేంద్రం పిలిచినప్పుడు ఢిల్లీకి రావాలా..? కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పోవాలా..? ఫామ్‌హౌస్‌కు పోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కా రం కోసం ప్రతిపక్షనేతగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలువొచ్చన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్ర తిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమన్నారు. కేసీఆర్ హయాంలో ఏం జరి గిందో వారి కుటుంబసభ్యులే బయటికి వ చ్చి చెప్తున్నారని.. సొంత ప్రయోజనాల కో సం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కో సమే తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.
లోకేశ్‌తో కేటీఆర్‌కు చీకటి భేటీ ఎందుకు..?
హైదరాబాద్‌లో ఏపీ మంత్రి లోకేశ్‌ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మూడుసార్లు లోకేశ్‌తో కేటీఆర్ కలిసి డిన్నర్ చేశారని తెలి పారు. కేదార్‌తో కలిసి కేటీఆర్ దుబాయిలో డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడని, కేదార్ మరణంపై పూర్తి నివేదిక ఉందని సీఎం తెలిపారు.
మద్యంలో కాక్‌టెయిల్ విన్నామని, డ్రగ్స్‌లో కాక్‌టెయిల్ వినలేదని, డ్రగ్స్ విషయంలో తొలిసారి కాక్‌టెయిల్ అని వింటు న్నామని తెలిపారు. అవసరమైనప్పుడు కేదార్ మరణానికి గల కారణాల రిపోర్టు బయటపెడతామని అన్నారు. కేదార్ మరణ కారణాల రిపోర్టు అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమేనని, తాను చర్చిస్తానంటోంది ప్రతిపక్షనేత కేసీఆర్‌తో మాత్రమేనని, కేటీఆర్‌తో కాదని సీఎం వెల్లడించారు. కేటీఆర్ చుట్టు డ్రగ్స్ బ్యాచ్ ఉందని తెలిపారు.
గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదని, ఛాలెంజ్ చేయడం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్‌కు అలవాటే అని సీఎం ఎద్దేవా చేశారు. డ్రగ్స్ తీసు కునే కేటీఆర్‌తో తానేం మాట్లాడతానన్నారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురకలు అంటించారు. శాఖాపరమైన విచారణలు రాత్రికి రాత్రి పూర్తి కావన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో..స్లీపింగ్ ప్రెసిడెంటో తనకు తెలియ దని సెటైర్లు వేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది..
హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని సీఎం తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని, విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును స్వదేశానికి రప్పించడంలో కేంద్రం ఏడాదిన్నర ఆలస్యం చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాష్ర్ట దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తిచూపించాలని బీజేపీ నేతలకు సీఎం సూచించారు.
రాష్ర్టంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులు ఈడీ తీసుకుందని, ఈ కేసుల విచారణలో పురోగతి ఎందుకు లేదన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడేందుకు కిషన్‌రెడ్డి ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఎవరితో శత్రుత్వాలు, వైరుధ్యాలు లేవని, కేసీఆ ర్ కేవలం తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని రేవంత్‌రెడ్డి అన్నారు.
బీసీ రిజర్వేషన్లను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రద్దు చేస్తారా..?
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై తమకో వ్యూహం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2018లో కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టంలో 50 శాతం రిజర్వేషన్లు వద్దని మార్పులు చేశారని సీఎం విమర్శించారు. 2014 ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని తెలిపారు. ఇప్పుడు రిజర్వేషన్ల కుదిం పును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బీసీ- గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని, బీజేపీ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని సీఎం వివరించారు. గుజరాత్, యూపీ, మహారాష్ర్టలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్‌రెడ్డి మాట్లాడాలని రేవం త్‌రెడ్డి సూచించారు.