calender_icon.png 25 June, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాపుగల్లు గ్రామ పంచాయతీకి 100 ఎల్ఈడి వీధి దీపాలు అందజేత

24-06-2025 09:33:11 PM

దొంతగాని అప్పారావు గౌడ్..

కోదాడ: మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ పంచాయతీకి చెందిన బిఆర్ఎస్ నాయకుడు దొంతగాని అప్పారావు(BRS leader Donthagani Apparao) గ్రామానికి లక్ష రూపాయల విలువ గల 100 ఎల్ఈడి వీధి దీపాలు మంగళవారం బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గతంలో పల్లెలు పట్టణాలు దీటుగా అభివృద్ధి పొందాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని అన్నారు. ఇప్పటికైనా పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించి త్వరలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శివెంకట్ నారాయణ, నాగేశ్వరరావు, కాసాని గోపి,, గోపి సతీష్, సీతారాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.