16-07-2025 12:30:43 AM
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై డిప్యూటీ సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నోటీసులో పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు ఈ నోటీసు అందిన 3 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కింద రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసుల్లో ఆయ న స్పష్టం చేశారు.
రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ పదోన్నతులు కల్పిస్తోందని.. దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఓ మీడియా సమావేశంలో భట్టి వ్యాఖ్యానించారని.. తనను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యా ఖ్యలు తన పరువునకు నష్టం కలిగించేలా ఉన్నాయని రాంచందర్‌రావు నోటీసుల్లో పేర్కొన్నారు.
డిఫ్యూటీ సీఎం భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాం చందర్‌రావు హెచ్చరించారు. రోహి త్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని.. దానికి ఎవరూ బాధ్యులు కాద ని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు.