calender_icon.png 9 November, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టబద్ధంగా 42% వాటా కల్పించాలి

09-11-2025 12:43:38 AM

  1. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాల గర్జన 

బీసీ జాక్ ఆధ్వర్యంలో అంబర్‌పేటలో భారీ ర్యాలీ

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 8 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టకుండా, రా జ్యాంగబద్ధంగా 42% వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు తెలంగాణ బీసీ జాక్ ఆధ్వర్యంలో శనివారం అంబర్‌పేట చౌరస్తా నుంచి జ్యోతిరావు ఫూలే విగ్రహం వరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్ నాయకత్వం వహించిన ఈ ప్రదర్శనలో, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో కు పూర్తి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత ఉం దని, న్యాయస్థానాల్లో దీన్ని ఎవరూ సవాల్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ర్ట, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా అక్కడ బీసీలు తిరగబడలేదు. కానీ, తెలంగాణలో రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ర్ట బంద్ విజయవంతం కావడం మన బీసీల చైతన్యానికి ప్రతీక అని కృష్ణయ్య అన్నారు.

గత నెల 18న జరిగిన బంద్‌తోనైనా ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలు కళ్లు తెరిచి బీసీల వాటా వారికి అందించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని ఆరోపించారు.  మాకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు దక్కేవరకు ఈ ఉద్యమం ఆగదు.

మా డిమాండ్లు నెరవేర్చకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనీయం, అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, తెలంగాణా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాజేందర్, బీసీ యువజన సంఘం రాష్ర్ట అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరేగే మల్లేష్ యాదవ్, బాణాల అజయ్, భీమ రాజ్, శివ కుమార్ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.