10 April, 2026 | 7:27 PM

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •  

నీరజకే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఛాన్స్.!

16-02-2026 12:24 AM

తాండూరు, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ లో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రావడంతో చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ కు తెరపడింది.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్ణయం మేరకు నీరజ పేరును ఖరారు చేశారు.. అయితే ప్రధానంగా విధేయతే ప్రామాణికంగా చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక  జరిగిందని తెలిసింది.

కౌన్సిలర్ గా హ్యాట్రిక్ విజయం సాధించిన 12వ వార్డు కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి కే చైర్ పర్సన్ పీఠం ఛాన్స్ దక్కింది.. గతంలో ఆమె అధికార, విపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై  అనర్ఘళంగా అధికారులను, పాలకులను నిలదీసి  గళమెత్తారు. మున్సిపల్ పాలన తీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న నీరజకె చైర్ పర్సన్ పీఠం  దక్కింది.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు తాజాగా గెలుపొందిన మెజారిటీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు  సైతం నీరజ వైపే  మొగ్గు చూపించడంతో ఆమె పేరును ఖరారు చేశారు. సోమవారం జరిగే ప్రమాణ స్వీకారం  నీరజ బాల్రెడ్డి చైర్పర్సన్ గా ప్రమాణం చేయనున్నారు.