వికాసం కోసం వేసవి శిబిరం
14-06-2024 01:40 AM
అదనపు కలెక్టర్ రాహుల్
మంచిర్యాల, జూన్ 13 (విజయక్రాంతి): పిల్లల భౌతిక, మానసిక వికాసానికి శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా బ్రైటర్ మైండ్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నా రు. గురువారం నస్పూర్‌లో నిర్వహించిన శిబి రం ముగింపు కార్యక్రమంలో పిల్లలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రెయినర్ పాలకుల వెంకటేష్, జోనల్ కో ఆర్డినేటర్ అంజిరాల సతీష్ పాల్గొన్నారు.






