15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

17-02-2026 06:50 PM

కాగజ్ నగర్,(విజయ క్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసం మంగళవారం టిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి సీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని అన్నారు.

ఆయన చూపిన దారిలోనే పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మహిళా శక్తి బీఆర్‌ఎస్‌కు బలమని, రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల సందర్భంగా మహిళలు నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా అభిమానులు పాల్గొన్నారు.