calender_icon.png 15 October, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల పొలం బాట

15-10-2025 08:18:32 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు బుధవారం మండలంలోని ఉత్కూర్ గ్రామంలో పొలంబాట నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను విద్యుత్ సిబ్బంది కలిసి వంగిన పోల్స్ సరి చేయడం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగు, లూస్ లైన్స్ సరిచేశారు. అనంతరం ఏడిఈ ప్రభాకర్ మాట్లాడుతూ... రైతులు పొలాలలోని మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని దాని ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని అగ్రికల్చర్ కు నాణ్యమైన విద్యుత్ అందియడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ గణేష్, నర్సింగ రావు, సత్యనారాయణ, రవికుమార్, రాజమౌళి, స్థానిక విద్యుత్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.