9 May, 2026 | 11:36 AM

తట్టేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

17-09-2025 12:32 AM

భయాందోళనలు రైతన్నలు

విచారణ చేస్తున్న అటవీశాఖ అధికారులు

తాండూరు, 16 సెప్టెంబర్, (విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం తట్టేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేడు అటవీ ప్రాంతం నుండి పంట పొలాల మీదుగా చిరుత పులి వెళ్ళిన ట్టుగా గుర్తించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తాండూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి మరియు సెక్షన్ బీట్ అధికారులు స్వప్న, నాగ సాయిలు అటవీ ప్రాంతంలో చిరుత ఆనవాళ్ళ కోసం గాలించారు. ఈ సందర్భంగా అధికారులకు మాట్లా డుతూ చిరుత అడుగులుగా గుర్తించా మని పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారు లకు తెలియజేస్తామని అన్నారు. అనంతరం తగు చర్యలు చూసుకుంటా మని తెలిపారు.