calender_icon.png 17 September, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతి, మహతి ఆడిటోరియంలో 22 వరకు ధ్యాన మహాయజ్ఞం

17-09-2025 12:32:18 AM

అర్మూర్,సెప్టెంబర్16 (విజయ క్రాంతి): పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ pmc వారి ఆధ్వర్యంలో  ప్రపంచ శాంతి కొరకు  కలి యుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి తిరుపతి, మహతి ఆడిటోరి యం నందు ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు  7  రోజులపాటు జరిగే ధ్యాన మహా యజ్ఞం కార్యక్రమానికి   శ్రీ నవనాథ సిద్దేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మందిరం నుండి  ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్లు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లడం జరిగిందని  pssm నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి తెలిపారు.

మహతి ఆడిటో రియంలో 7 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని,  ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందని, అందులో భాగంగా ప్రతిరోజు 6 గంటల సామూహిక ధ్యానం, ఎందరో మంది ఆధ్యాత్మిక గురువులు స్వాములు యొక్క సందేశం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన జ్ఞాన సందేశాలు, సాంస్కృతిక కార్యక్ర మాలు, ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని, 

ఈ కార్యక్రమానికి తరలి వెళ్లడం జరిగిందని సాయి కృష్ణారెడ్డి తెలి పారు. ప్రత్యేక బస్సులో తరలివెళ్లిన వారిలో pssm నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సభ్యులు ముని పల్లి మల్లయ్య, ఆర్మూర్ రాజు, ఇస్సాపల్లి దేవేందర్ రెడ్డి  50 మంది ధ్యాన బంధు వులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.