8 April, 2026 | 2:19 AM

మారుమూల ప్రాంతాల్లోనూ వైద్య సేవలు

08-04-2026 12:00 AM

కలెక్టర్ కే. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7(విజయ క్రాంతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. సుబోధ్ కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామా జిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నట్లు కలెక్టర్ తెలిపారు. కాగజ్నగర్లో నిర్మాణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని సెప్టెంబ ర్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వైద్య, అంగన్వాడీ సిబ్బంది సేవ లు మరింతగా అందించాలని సూచించారు. గిరిజన గ్రామా ల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.