23 June, 2026 | 11:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గుణపాఠాలు అవసరమే

06-06-2024 12:05 AM

ఎన్నికలు వచ్చాయంటే, ట్రెండ్‌కు తగ్గట్టు కొందరు నాయకులు హఠాత్తుగా పార్టీలు  మార్చేస్తుంటారు. అలాంటి వారికి ఏ మాత్రం విలువలు వుండవా? అనిపిస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అటువంటి కొందరిని ఓడించడం ద్వారా ప్రజలు బాగానే గుణపాఠం చెప్పారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, సునీతా మహేందర్‌రెడ్డి, నీలం మధు, కాసాని జ్ఞానేశ్వర్, గోమాస శ్రీనివాస్, ఆరూరి రమేశ్, దానం నాగేందర్ వంటివారికి పార్టీలు మారినా ఫలితం దక్కలేదు. ఓటర్లు కూడా విచక్షణతో ఓట్లు వేస్తున్నారని దీన్నిబట్టి అర్థమవుతున్నది. ఇకముందైనా ఇలా ఎన్నికల వేళ పార్టీలు మారకుండా ఉంటారేమో చూడాలి.

 బుర్ర రాఘవేంద్ర గౌడ్, గుర్రంగూడ