23 June, 2026 | 9:48 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

విలక్షణమైన తీర్పు

06-06-2024 12:05 AM

దేశ ప్రజలు ఎప్పుడూ ఎంతో వివేకంతోనే ఎన్నికల్లో తీర్పులు ఇస్తుంటారు. ఈసారి కూడా 18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం మీద జనం విలక్షణ తీర్పునే ఇచ్చారు. బీజేపీ కోరుకున్నట్టు 400 స్థానాలకు పైబడి వచ్చివుంటే రాజ్యాంగ మార్పులకు సిద్ధపడుతుందేమో అన్న భయం చాలామందిలో ఏర్పడిన మాట నిజమే. ఆ పార్టీవారు ఎంత వివరణలు ఇచ్చినా ప్రజలు నమ్మిన ట్టు లేరు. అలాగే, కొన్ని ప్రాంతాలలో ఆ పార్టీకి ఎదురుగాలి వీచినట్టుంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, మిత్రపక్షాలవైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఏమైనా, దేశం మరో ఐదేళ్లపాటు ఎలాంటి అస్థిరతలు, గొడవలు లేకుండా పురోభివృద్ధి దిశగా ప్రయాణించాలని దేశప్రజలు కోరుకుంటున్నట్టుగా దీన్నిబట్టి అర్థమైంది.

 కామాక్షి పండిట్, జహీరాబాద్