07-01-2026 01:10:42 AM
నామినేటెడ్ సభ్యురాలు నర్మద మల్లికార్జున
సికింద్రాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ అభివృద్ధి అంశంపై స్పందించారు. సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యేను అభినందించారు. గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కంటోన్మెంట్‌కు ఏమి చేశారని ప్రశ్నించారు. సర్వీస్ ఛార్జీల అంశాన్ని అప్పట్లో పట్టించుకోలేదని బానుక నర్మద ఆరోపించారు. 4 వేల కోట్లు, 6 వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఆ నిధుల వివరాలు వెల్లడించాలని, బడ్జెట్ విడుదల చేశా రా అని నిలదీశారు.
మళ్లీ ఎప్పుడు 50 కోట్లు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు..? 5వేల కోట్లు 6 వేల కోట్లు మరిచారా అన్ని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గత 10 నెలల్లో 15 కోట్ల నిధులు ఖర్చు చేశామని వెల్లడించారు.ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకా రంతో 303 కోట్ల నిధులు తీసుకు వచ్చామని నర్మద తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజ్ సహా పలు అభి వృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అభివృద్ధి కోసం పార్టీకి అతీతంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..