calender_icon.png 12 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న మరోసారి దావోస్‌కు..

07-01-2026 01:11:08 AM

  1. భారీగా పెట్టుబడులు తెస్తాం

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఈనెల 19న మరోసారి వరల్డ్ ఎకానమిక్ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారుల బృం దమంతా కలిసి దావోస్‌కు వెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపా రు. భారీగా పెట్టుబడులు తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటిక ల్లా 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అందకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైజింగ్ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

మంగళవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు సులువుగా వచ్చేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెడికల్ టూరిజం తీసుకొచ్చామన్నారు. గతంలో దావోస్‌లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతామన్న వాటిలో 60 శాతం గ్రౌండ్ అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ తీసుకొచ్చామని, దాన్ని వందకు తీసుకెళ్తామని, ఇప్పటి వరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని మంత్రి తెలిపారు.