calender_icon.png 30 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా కూటమిని గెలిపిద్దాం..

04-05-2024 02:15:34 AM

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి, ఇండియా కూటిని గెలిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం లోని శేషగిరి భవన్‌లో శుక్రవారం అఖిపక్షం ఆద్వర్యంలో నిర్వహించి న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎన్‌ఎండీసీ వంటి మూతపడిన పరిశ్రమను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పాల్వం చలోని కేటీపీఎస్ పరిధిలో 800 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నెరవేర్చుకునేలా చేస్తామన్నారు.

శనివారం కొత్తగూడెంలోని ప్రశాశం స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సభను విజయవంతం చేయా లని నాయకులకు సూచించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, నాయకులు చలిగంటి శ్రీని వాసరావు, చంద్రగిరి శ్రీనివాస్, చారి, బోయిన విజయ్, గిద్దాడ నగేష్ , జేవీఎస్ చౌదరి, తూం చౌదరి, తోట దేవిప్రసన్న, అన్నవరపు సత్యనారాయణ, రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.