నెల్లూరులో జావా ఎజ్డీ మోటార్ సైకిల్ కొత్త ఔట్ లెట్
నెల్లూరు ః మోటార్ రంగంలో పలు కంపెనీలు తమ ఔట్ లెట్స్ ను మరింతగా విస్తరిస్తున్నాయి. తాజాగా జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ నెల్లూరులోని తమ కొత్త డీలర్ షిప్ ను ప్రారంభించింది. తద్వారా తమ రిటైల్ ఔట్ లెట్ల సంఖ్యను పెంచుకుంది. దేశంలోనే అత్యధికంగా టూ వీలర్స్ విక్రయాల్లో భాగంగా ఉన్న జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో పలు లక్ష్యాలను నిర్థేశించుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో క్లాసిక్ మోటార్ సైకిల్స్ పట్ల ఆసక్తి గల వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిని గమనించి ఔట్ లెట్లను విస్తరిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని జాతీయ రహదారులు, అటవీ కారిడార్లు, సముద్రం వైపుగా ఉన్న మార్గాలు ఎక్కువ దూరాలు,ఆకర్షణీయమైన ప్రయాణాలను కోరుకునే వారిని తమ ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయని జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ కో ఫౌండర్ అనుపమ్ థరేజ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ఆకర్షణీయమైన కొన్ని రైడింగ్ మార్గాల్లో నెల్లూరు ఉందన్నాపు. ఈ కొత్త డీలర్ షిప్ ద్వారా రైడర్స్ కు అందుబాటులో ఉండడం ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ నెట్ వర్క్ లో హనుమాన్ సాయి అండ్ కో చేరిందన్నారు. శిక్షణ పొందిన టెక్నీషియన్స్, ఆధునిక సౌకర్యాలతో మొట్ట మొదటి కస్టమర్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా డీలర్ షిప్ కు మద్దతు లభిస్తోందని కంపెనీ తెలిపింది.




